Header Banner

మంత్రి లోకేష్ కృషితోనే అనంతపురంకు రెన్యూ ఎనర్జీ! ఇక ఉద్యోగాల జాతరే!

  Fri May 16, 2025 17:05        Politics

మంత్రి నారా లోకేష్ గారి చొరవతోనే రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టు అనంతపురానికి వచ్చిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నారా లోకేష్ దావోస్ పర్యటనలో రెన్యూ ఎనర్జీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకుని రూ. 22వేల కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టును ఏపీకి తీసుకొచ్చారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ... స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రైతులకు మంచి కౌవులు అందేలా ఈ ప్రాజెక్టును అనంతపురానికి తీసుకొచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.

 

పునరుత్పాదక విద్యుత్ పెట్టుబడులకు సంబంధించి గుజరాత్ గాంధీనగర్ లో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వరుస కట్టాయని అన్నారు.గతంలో రాష్ట్ర విభజన అనంతరం పునరుత్పాదక విద్యుత్ రంగంలో రాయలసీమ ప్రాంతంలో సుమారు 7 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను తీసుకొచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుర్తు చేశారు.ఇదే రాయలసీమలో పుట్టి, సీమ బిడ్డను అని గొప్పలు చెప్పుకునే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం ఒక్క మెగావాట్ ప్రాజెక్టును కూడా తీసుకుని రాలేదని, ఇందుకు జగన్ రెడ్డి సిగ్గుపడాలని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమ ప్రాంతం అనువైన ప్రదేశంగా గుర్తించామని పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రాయలసీమ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుందని వివరించారు.

 

20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నారా లోకేష్ అడుగులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అయితే ప్రకాశం, రాయలసీమ జిల్లాల నుంచి 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందడుగు వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయిన పెట్టుబడిదారుల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం నింపి సుమారు రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ఎంతో మంది యువతీ యువకులు ఆయన్ను కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు.

 

ఇది కూడా చదవండి:  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

అప్పుడు యువకులకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ ప్రకారం పెద్ద సంఖ్యలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర యువతీ యువకులు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగుళూరు లాంటి నగరాలకు వలస పోవాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో సుమారు 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రతీ సీబీజీ ప్లాంట్ ద్వారా కనీసం 500 పైగా మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా మంత్రి నారా లోకేష్ పని చేస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు.


కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా?
అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలు ఏం చేస్తున్నారని వైసీపీ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. పది నెలలుగా చేస్తున్న అభివృద్ధి వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను కేవలం ఒక్క సంతకంతోనే పెంచామని మంత్రి గుర్తు చేశారు. అంతేగాకుండా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులకు సుమారు రూ. 800 కోట్ల ఖర్చు చేసిన మరమ్మత్తులు చేయినట్లు వెల్లడించారు. మరో రూ.600 కోట్లు రహదారుల కోసం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం గుంతల రోడ్లపై తట్ట మట్టి కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు.

 

ఇది కూడా చదవండిఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Lokesh #Anantapur #RenewableEnergy #GreenEnergy #CleanEnergy